Header Banner

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

  Tue May 06, 2025 11:55        Politics

రైతులు, పశువుల పెంపకందారులకు ఉపయోగపడేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశుగ్రాసం దొరక్క పశువుల పెంపకందారులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వారికి ఊరట కలిగిస్తూ 50 శాతం రాయితీపై రైతులకు పశువుల దాణా పంపిణీ చేయాలని ఏపీ పశుసంవర్ధక శాఖ నిర్ణయించింది. 50 కేజీల బస్తాను రూ.1100లకు కొనుగోలు చేసి రైతులకు రూ.555లకు అందించాలని నిర్ణయించింది. తెల్ల రేషన్ కార్డు కలిగిన రైతులు, పశువుల పెంపకందారులు ఇందుకు అర్హులు.

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పశువుల పెంపకందారులకు ఏపీ ప్రభుత్వం ఊరట నిచ్చే నిర్ణయం తీసుకుంది. ఎండాకాలం కావటంతో పశువులకు పచ్చగడ్డి దొరకటం కష్టం. దీంతో పశువులకు సరైన పోషణ లేక పాల దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పశువుల పెంపకందారులకు ఉపయోగపడేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు 50 శాతం రాయితీపై దాణా అందించాలని నిర్ణయించింది.

 


ఏపీకి గూగుల్.. చంద్రబాబు కీలక ప్రకటన..

20 శాతం ప్రోటీన్ కలిగిన బలవర్ధకమైన దాణాను 50 శాతం రాయితీపై రైతులకు అందించాలని ఏపీ పశుసంవర్ధక నిర్ణయం తీసుకుంది. 50 కేజీల దాణా బస్తాను రూ.1100 చొప్పున కొని రైతులకు రూ.555 లకే అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాయితీ కల్పించడం ద్వారా ఆర్థికంగా ప్రభుత్వం మీద భారం పడినప్పటికీ వేసవి కాలంలో పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు, పాల దిగుబడి తగ్గకుండా చూసుకునేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అధికారులు చెప్తున్నారు.



 ఇది కూడా చదవండిటీడీపీకి తీరని లోటు..! సీనియర్ నేత మాజీ ఎంపీ కన్నుమూత!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!

 

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #APGovt #FarmersWelfare #AnimalHusbandryAP #LivestockSupport #DairyDevelopment #AndhraPradesh